Great opportunity for job seekers in Telangana! తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. TGSRTC (Telangana State Road Transport Corporation) లో ఖాళీగా ఉన్న 1,500 Permanent Bus Conductor పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.
Telangana ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన (Regular Basis) కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయడం ఇదే మొదటిసారి.
Notification & Job Details (నోటిఫికేషన్ పూర్తి వివరాలు)
| Feature | Job Details |
|---|---|
| Organization | TGSRTC (Telangana State Road Transport Corporation) |
| Post Name | Bus Conductor (Permanent Job) |
| Total Vacancies | 1,500 Posts |
| Qualification | 10th Class Pass (SSC Pass) |
| Selection Process | No Written Exam (Directly based on 10th Class Marks Merit) |
| Age Limit | Minimum 18 Years Completed |
| Notification Release | Expected within 10 Days |
| Official Website | tgsrtc.telangana.gov.in |
Important Highlights (ముఖ్యమైన విషయాలు):
- No Written Exam (రాత పరీక్ష లేదు): ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. 10th Class (SSC) లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను డైరెక్ట్‌గా ఎంపిక చేస్తారు.
- Merit List Confusion (మార్కుల లెక్కింపు): కొంతమంది అభ్యర్థులకు GPA గ్రేడింగ్, మరికొందరికి మార్కులు ఉండటం వల్ల.. ఆ గ్రేడింగ్‌ను మార్కుల శాతంగా (Percentage) ఎలా మార్చాలనే దానిపై RTC అధికారులు SSC బోర్డు నుండి క్లారిటీ తీసుకుంటున్నారు.
- Notification Date (నోటిఫికేషన్ ఎప్పుడు?): ఈ మార్కుల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాగానే, మరో 10 రోజుల్లో అప్లికేషన్ స్టార్ట్ డేట్స్ తో కూడిన పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది.
- How to Apply (ఎలా అప్లై చేయాలి?): నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Salary & Scale (జీతం వివరాలు)
The appointments will be made on a regular time-scale (Permanent Govt Job) with a starting annual salary of around ₹3 Lakhs Per ( ఇది కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం కాదు. డైరెక్ట్ రెగ్యులర్ టైమ్-స్కేల్ )
Conductor Licence Required (లైసెన్స్ తప్పనిసరి)
Along with a 10th-class pass certificate, candidates must possess a valid Conductor Licence issued by the RTA (Transport Department )
(రవాణా శాఖ (RTA) జారీ చేసిన కండక్టర్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి.)
Direct Recruitment by TGSRTC (ఆర్టీసీ ద్వారానే నియామకాలు)
Unlike other driver/labor posts handled by the Police Recruitment Board (TSLPRB), these 1,500 conductor vacancies are likely to be filled directly by the TGSRTC management ( ఈ 1,500 కండక్టర్ పోస్టులను TGSRTC యాజమాన్యమే నేరుగా రీజియన్ల వారీగా (Region-wise) ఖాళీలు మరియు రిజర్వేషన్లను బట్టి భర్తీ చేయనుంది)
Both Male and Female candidates from all districts of Telangana are eligible to apply for these posts.
Conductor Licence & Badge ఉండటం చట్టపరంగా తప్పనిసరి.
1. ఎందుకు తప్పనిసరి (Why is it mandatory?)
కేవలం 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ మాత్రమే సరిపోదు. అభ్యర్థులకు ప్రథమ చికిత్స (First-Aid) తెలిసి ఉండాలి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులను కాపాడేందుకు St. John Ambulance Association లేదా సివిల్ సర్జన్ ద్వారా పొందిన First-Aid Certificate ఉంటేనే RTA ఆఫీస్ వాళ్ళు కండక్టర్ లైసెన్స్ ఇస్తారు. ఆర్టీసీ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు ఈ లైసెన్స్ నంబర్ అడిగే అవకాశం ఉంది.
సాధారణంగా నోటిఫికేషన్ అప్లికేషన్ సమయానికే లైసెన్స్ అడుగుతారు. అయితే, కొన్నిసార్లు రిక్రూట్‌మెంట్‌లో మహిళా అభ్యర్థులకు లేదా ప్రత్యేక కేటగిరీల వారికి సెలెక్ట్ అయిన తర్వాత 3 నెలల లోపు లైసెన్స్ తెచ్చుకునేలా చిన్న మినహాయింపు (Relaxation) ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ, పురుషులకు మాత్రం ముందే ఉండటం సేఫ్
ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? (How to get it online?)
ఎవరికైనా లైసెన్స్ లేకపోతే, నోటిఫికేషన్ రావడానికి ఇంకా 10 రోజులు టైమ్ ఉంది కాబట్టి ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు.
How to Apply for a Bus Conductor Licence Online? (కండక్టర్ లైసెన్స్ ఎలా పొందాలి?)
TGSRTC కండక్టర్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే 10th క్లాస్ మార్కులతో పాటు Conductor Licence ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే, నోటిఫికేషన్ రావడానికి ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఇప్పుడే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయి అప్లై చేసుకోండి:
📁 Required Documents (కావలసిన పత్రాలు):
- Medical Fitness Certificate: గవర్నమెంట్ డాక్టర్ సంతకం చేసిన మెడికల్ సర్టిఫికేట్ (Form 1A).
- First-Aid Certificate: సెయింట్ జాన్ అంబులెన్స్ (St. John Ambulance Association) లేదా సివిల్ సర్జన్ ద్వారా పొందిన ప్రథమ చికిత్స సర్టిఫికేట్.
- Age & Address Proof: 10th Class Marks Memo, Aadhaar Card.
💻 Step-by-Step Online Process (అప్లై చేసే విధానం):
- Step 1: కేంద్ర రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్ Sarathi Parivahan Portal ఓపెన్ చేయండి.
- Step 2: మీ స్టేట్ “Telangana” అని సెలెక్ట్ చేసుకోండి.
- Step 3: మెనూ బార్‌లో ఉన్న “Conductor Licence” ఆప్షన్‌పై క్లిక్ చేసి, “New Conductor Licence” సెలెక్ట్ చేసుకోండి.
- Step 4: మీ పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ మరియు విద్యార్హతల వివరాలను తప్పులు లేకుండా టైప్ చేయండి.
- Step 5: పైన చెప్పిన Documents (10th Memo, First Aid Certificate, Medical Certificate) అప్‌లోడ్ చేయండి.
- Step 6: చివరగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజ్ చెల్లించి, రశీదును (Receipt) ప్రింట్ తీసుకోండి.
ఫీజ్ పేమెంట్ పూర్తయిన తర్వాత మీ ప్రాంతంలోని RTA (Regional Transport Authority) ఆఫీస్‌కు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి వెరిఫికేషన్ చేయించుకుంటే, వారం రోజుల్లో మీ Conductor Licence & Badge మొబైల్‌కే డౌన్లోడ్ అవుతుంది.