Lic Jobs telangana Andhra Pradesh
LIC HFL Jobs Notification 2026 | Degree Jobs | పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది. డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి మంచి అవకాశం. ఈ జాబ్స్ లో ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ సమయంలో నెలకు స్టైపెండ్ కూడా అందుతుంది. తెలంగాణలో 16 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్‌కు అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 1, 2026 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
LIC HFL Apprentice Recruitment 2026 వివరాలు
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ పేరు | LIC Housing Finance Limited |
| పోస్టు పేరు | Apprentice |
| మొత్తం ఖాళీలు | 232 |
| ఉద్యోగ రకం | Apprenticeship Training |
| ట్రైనింగ్ కాలం | 12 నెలలు |
| అప్లై చేసే విధానం | Online |
| చివరి తేదీ | 1 నవంబర్ 2026 |
| ట్రైనింగ్ లొకేషన్ | దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాలు |
LIC HFL Jobs Notification 2026 Full Details in Telugu
విద్యార్హత (Qualification)
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.
- BA, B.Com, B.Sc, BBA, BCA వంటి డిగ్రీలు చేసినవారు అర్హత నిబంధనలు సరిపోతే అప్లై చేయవచ్చు.
- 2026 అక్టోబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- డిగ్రీ అక్టోబర్ 1, 2001 కంటే ముందు పొందినవారు అర్హులు కారు.
వయస్సు ఎంత ఉండాలి? (Age Limit)
ఈ నోటిఫికేషన్ ప్రకారం 2026 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో వయస్సు నిబంధనలు ఒకసారి చెక్ చేసుకోండి.
నెలకు ఎంత స్టైపెండ్ వస్తుంది? (Stipend)
ఈ Apprentice ట్రైనింగ్ సమయంలో పోస్టింగ్ ఉన్న ప్రాంతాన్ని బట్టి నెలకు స్టైపెండ్ ఇస్తారు.
| ప్రాంతం | నెలవారీ స్టైపెండ్ |
|---|---|
| Metro Cities | ₹16,650 |
| ఇతర నగరాలు | ₹14,150 |
హైదరాబాద్ కూడా Metro Cities జాబితాలో ఉంది. అయితే మీకు ఏ ప్రాంతంలో ట్రైనింగ్ కేటాయిస్తారనేది ఎంపిక ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.
గమనిక: ఇది ఒక సంవత్సరం ట్రైనింగ్ ప్రోగ్రామ్. ట్రైనింగ్ పూర్తయ్యాక LIC HFLలో పర్మనెంట్ ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
| అభ్యర్థుల కేటగిరీ | ఫీజు |
|---|---|
| General / EWS / OBC – Male | ₹800 + GST |
| General / EWS / OBC – Female / Transgender | ₹600 + GST |
| SC / ST / PwBD | ₹200 |
ఫీజు చెల్లించే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో మీ కేటగిరీకి వర్తించే మొత్తం చెక్ చేసుకోండి. చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు.
ఎంపిక విధానం (Selection Process)
ఈ Apprentice పోస్టులకు ఎంపిక కోసం ప్రధానంగా ఈ ప్రక్రియ ఉంటుంది:
- Online Entrance Examination
- పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ పరీక్షలో 100 ప్రశ్నలు, మొత్తం 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
| ఈవెంట్ | తేదీ |
|---|---|
| అప్లికేషన్లు ప్రారంభం | 20 అక్టోబర్ 2026 |
| అప్లై చేయడానికి చివరి తేదీ | 1 నవంబర్ 2026 |
| Online Exam | 7 నవంబర్ 2026 |
| డాక్యుమెంట్ వెరిఫికేషన్ / ఇంటర్వ్యూ | 15 నవంబర్ 2026 |
LIC HFL Apprentice Jobs 2026 – ఎలా అప్లై చేయాలి?
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
- మొదటి స్టెప్: మొదటగా కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ అయిన NATS Portal లోకి వెళ్లి ‘Student’ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రెండవ స్టెప్: అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, మీకు వచ్చే ఈమెయిల్ లింక్ లేదా LIC HFL Careers Page ద్వారా అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అధికారిక లింక్స్:
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. LIC HFL Apprentice Jobs 2026కు Freshers అప్లై చేయవచ్చా?
అవును. డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చు.
2. ఏ డిగ్రీ చేసినవారు అప్లై చేయవచ్చు?
ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అప్లై చేయవచ్చు.
3. నెలకు ఎంత డబ్బు వస్తుంది?
ట్రైనింగ్ సమయంలో ప్రాంతాన్ని బట్టి నెలకు ₹14,150 నుంచి ₹16,650 వరకు స్టైపెండ్ వస్తుంది.
4. అప్లై చేయడానికి చివరి తేదీ ఏంటి?
1 నవంబర్ 2026 చివరి తేదీగా ప్రకటించారు.
5. ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ జాబ్ వస్తుందా?
ట్రైనింగ్ పూర్తయ్యాక పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారని గ్యారంటీ అయితె లేదు. ఇది ఒక సంవత్సరం Apprenticeship ప్రోగ్రామ్. ఆసక్తి ఉన్నవారు ట్రై చేయండి.
ముగింపు
డిగ్రీ పూర్తి చేసి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అనుభవం సంపాదించాలనుకునే వారికి LIC HFL Apprentice Recruitment 2026 మంచి అవకాశం. అయితే ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదని గుర్తుంచుకోండి. అర్హత ఉన్నవారు అధికారిక నోటిఫికేషన్ చదివి, చివరి తేదీ లోపు అప్లై చేయండి.
ALLTHEBEST : ఏమైనా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.