UCO Bank Degree Jobs Notification 2026 Telugu బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే నిరుద్యోగులకు యూకో బ్యాంక్ (UCO Bank) ఒక మంచి ఛాన్స్ తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న తన బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ పాసైన యువతకు ఇదొక చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హతలు మరియు సెలక్షన్ ప్రాసెస్ వివరాలను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కింద సింపుల్‌గా చూద్దాం
UCO Bank Degree Jobs Notification 2026 Telugu | నోటిఫికేషన్ ముఖ్యాంశాలు (Quick Overview) |
| వివరాలు | సమాచారం |
| ఆర్గనైజేషన్ | యూకో బ్యాంక్ (UCO Bank) |
| పోస్టుల పేరు | అప్రెంటిస్ (Apprentice) |
| మొత్తం ఖాళీలు | 530 (ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 8 పోస్టులు) |
| ట్రైనింగ్ కాలపరిమితి | 1 సంవత్సరం |
| నెలవారీ స్టైపెండ్ | ₹16,650/- |
| అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ మాత్రమే |
| చివరి తేదీ | 29 అక్టోబర్ 2026 |
| పరీక్ష తేదీ | 07 నవంబర్ 2026 |
ALSO READ : RRB NTPC Graduate Recruitment 2026 Degree Jobs In Telugu
Andhra Pradesh, Telangana Jobs
| రాష్ట్రం | పోస్టులు |
|---|---|
| Andhra Pradesh | 8 |
| Telangana | 8 |
| Total | 16 |
UCO Bank Degree Jobs Notification 2026 Telugu
ఈ రాష్ట్రాల ఖాళీలు కేటగిరీ వారీగా కూడా విభజించారు. ఎంపిక చేసిన రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం రావాలి.
ఎవరు అప్లై చేసుకోవచ్చు? (అర్హతలు)
- చదువు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (Graduation) పాసై ఉండాలి. అయితే, మీ డిగ్రీ సర్టిఫికేట్ లేదా మార్క్స్ లిస్ట్ 01 ఏప్రిల్ 2022 లేదా ఆ తర్వాత వచ్చినదై ఉండాలి. అంతకంటే ముందు పాసైన వారు దీనికి అర్హులు కారు.
- వయస్సు: 01 అక్టోబర్ 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
జీతం ఎంత ఇస్తారు?
ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు, ఒక సంవత్సరం పాటు ఇచ్చే ప్రాక్టికల్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో బ్యాంక్ వారు నెలకు ₹16,650 స్టైపెండ్ ఇస్తారు. బ్యాంకింగ్ రంగంపై అవగాహన పెంచుకోవడానికి మరియు ఫ్యూచర్‌లో బ్యాంక్ ఉద్యోగాల ప్రిపరేషన్‌కు ఈ అనుభవం ఎంతో ప్లస్ అవుతుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ఈ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది:
- ఆన్‌లైన్ ఎగ్జామ్: నవంబర్ 7న ఆన్‌లైన్ లో ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, రీజనింగ్, మ్యాథ్స్ (ఆప్టిట్యూడ్) ల నుండి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- లోకల్ లాంగ్వేజ్ టెస్ట్: మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర అధికారిక భాష (తెలుగు రాష్ట్రాల వారికి తెలుగు) చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఎగ్జామ్ పాసైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన పురుషులకు: ₹800 + GST
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన మహిళలకు: ₹600 + GST
- ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు: ₹200 + GST
ఎలా అప్లై చేయాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాంక్ కేటాయించిన అఫీషియల్ అప్లికేషన్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అక్టోబర్ 29 వరకు వేచి చూడకుండా ఇప్పుడే అప్లై చేసుకోవడం మంచిది.
Apprentice Recruitment 2026–27 నోటిఫికేషన్ ఎంచుకోండి.
నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు నిర్ధారించుకోండి.
సూచించిన NATS / అప్లికేషన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
ఫీజు చెల్లించి అప్లికేషన్ కాపీ సేవ్ చేసుకోండి.
Apply Links : https://uco.bank.in/web/guest/job-opportunities
Registration Link: NATS
Direct Apply Link: UCO Bank Apprenticeship 2026–27
గమనిక: ఇది ఒక సంవత్సరం Apprenticeship Training మాత్రమే; శాశ్వత బ్యాంకు ఉద్యోగం కాదు.
Related Jobs : Canara Bank Apprentice Recruitment 2026 Degree Jobs In telugu
ALL THE BEST: డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.